Header Banner

జగన్ షరతులతో వణుకుతున్న వైసీపీ నేతలు! క్షణక్షణ భయంతో..!

  Thu May 22, 2025 18:40        Politics

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల పార్టీ నాయకులకు షరతు పెట్టారు. నియోజకవర్గాల్లో నిర్వహించే ఏ కార్యక్రమానికైనా, ఎంత ఖర్చెనా మీరే పెట్టుకోవాలని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో టికెట్ ఆశావహులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఒకవేళ ఈ నాలుగేళ్లు కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టుకున్నాక, ఎన్నికల సమయంలో మీకంటే మంచి అభ్యర్థి వచ్చాడంటూ మరొకరికి సీటు ఇస్తే తమ పరిస్థితి ఏంటనే ఆవేదనతో కూడా ప్రశ్న ఎదురవుతోంది.

 

ఇప్పుడు ఇదే వైసీపీ నాయకుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఇలాగే ఖర్చులు పెట్టుకోమని చెప్పి, తీరా ఎన్నికల్లో వేరే వాళ్లకు టికెట్లు ఇచ్చారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అందుకే ఖర్చు పెట్టుకోండి, టికెట్ మీకే అని చెబుతున్న జగన్ మాటల్ని విశ్వసించలేకపోతున్నామని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నాటికి జగన్ దృష్టిలో మంచి అభ్యర్థులుగా మరెవరైనా కనిపిస్తే, వాళ్లకు నిర్మొహమాటంగా టికెట్లు ఇస్తారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డుల గడువుపై సర్కార్ కీలక ప్రకటన! భారీ ఊరట!

 

ఆ రోజు టికెట్ ఇవ్వకుండా, ఎమ్మెల్సీ ఇస్తామనో, మరో పదవో ఆశ చూపించి, నోర్మూయిస్తారని అంటున్నారు. మరోవైపు అధికారంపై జగన్లో ధీమా కనిపిస్తోంది. అందుకే ఆయన ఎవర్నీ లెక్క చేసే పరిస్థితి వుండదని అంటున్నారు. ఇప్పటి నుంచి నియోజకవర్గాల్లో ఖర్చులంటే, తడిసి మోపడవుతాయని వైసీపీ నాయకులు అంటున్నారు.

 

అధికారంలో ఉన్నప్పుడు ఐదారుగురు మినహాయిస్తే, మరెవరికీ సంపాదించుకునే అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. ఇప్పుడు తమ దగ్గర భారీమొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలకైనా అధిష్టానం నుంచి ఖర్చులకు డబ్బు రాకపోతే, తాము ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీలో ఖర్చులు, టికెట్లపై ఆందోళన నెలకుందనేది వాస్తవం. ఇవన్నీ జగన్ పట్టించుకోరనేది మరో వాస్తవం. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులది అరణ్య రోదనే అని చెప్పక తప్పదు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!



టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!



అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!




విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..

 

అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!




ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #AndhraPravasi #Jagan #YSRCP #PoliticalDrama #FearAndPower #LeadershipPressure #TeluguPolitics #PoliticalTension